Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మురుగదాస్ తో అజిత్ మూవీ లేనట్టే

  • అజిత్ 60వ సినిమాగా 'వలిమై'
  • 61వ సినిమా దర్శకుడిగా వెంకట్ ప్రభు 
  • 'దర్బార్' పనుల్లో బిజీగా మురుగదాస్     
అజిత్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఆయన 60వ చిత్రంగా 'వలిమై' రూపొందుతోంది. వినోత్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అజిత్ 61వ సినిమా .. మురుగదాస్ తో వుండనున్నట్టుగా వార్తలు షికారు చేశాయి.

దాంతో అజిత్ అభిమానులంతా ఆనందంతో పొంగిపోయారు. 2001లో అజిత్ హీరోగా మురుగదాస్ 'ధీనా' అనే సినిమా చేశాడు. మళ్లీ ఇంత కాలానికి ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళుతున్నారని అనుకున్నారు. కానీ అజిత్ 61వ సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందనుందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. దాంతో మురుగదాస్ తో అజిత్ మూవీ లేనట్టేనని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మురుగదాస్ 'దర్బార్' సినిమా పనులతో బిజీగా ఉన్నాడనే విషయం తెలిసిందే.
Ajith
Murugadoss

More Telugu News